కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు: డీకే అరుణ

  • మద్యనిషేధం విధించాలని డీకే అరుణ డిమాండ్
  • ఇందిరాపార్క్ లో రెండ్రోజుల పాటు దీక్ష
  • సీఎం కేసీఆర్ పై విమర్శలు
తెలంగాణలో మద్యం నిషేధించాలంటూ బీజేపీ నేత డీకే అరుణ దీక్ష చేపట్టనున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో హైదరాబాద్ ఇందిరా పార్క్ లో డీకే అరుణ 'మహిళా సంకల్ప దీక్ష' పేరుతో మద్యపానం, మహిళలపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయనున్నారు.

ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. పబ్ లు, డ్రగ్స్ కు హైదరాబాద్ నగరం అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం కారణంగానే మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. దిశ ఘటనపై పార్లమెంటులో చర్చ జరిగినా సీఎం మాత్రం స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దిశ కుటుంబాన్ని కనీసం ఫోన్ లో కూడా పరామర్శించలేదని విమర్శించారు.
Go Back to Shorts
KCR
Telangana
Hyderabad
TRS
DK Aruna
BJP

More Telugu News